రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని మంచిర్యాల బస్టాండ్ నుండి ఐబీ వరకు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. జాతీయ సహజ వనరులను ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ , విదేశీ బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని విమర్శించారు.మాటల్లో జాతీయత చేతల్లో మాత్రం అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు దారపోస్తున్నారు అని అన్నారు.భారతమాత మీద ఉన్న ఆభరణాలు ఎల్ఐసి, బ్యాంకింగ్, పోస్టల్ ,రైల్వే తదితర ఆణిముత్యాలు అన్నిటిని కారుచౌకగా ఆధాని, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రాజ్యాంగం బద్ధంగా పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కులకుపై సైతం పాత చేస్తున్నారని విమర్శించారు.ఉపాధి, నిరుద్యోగం,అధిక ధరలు పాకాలి ,అసమానతలు ఆరోగ్యం,లాంటి ప్రాథమిక సమస్యలుపట్టించుకోకపోవడం విడ్డురామని విమర్శించారు.సంపద సృష్టికర్తలు కార్మికులు కానీ బడా పారిశ్రామికవేత్తల సంపద పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న అని విమర్శించారు.బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడేందుకు వారి మెప్పు పొందేందుకే కార్మిక వ్యతిరేకంగా నాలుగు కార్మిక కోడ్ లను తీసుకొచ్చారని అన్నారు.ఎల్ఐసి లో లక్ష కోట్ల రూపాయల వాటాలు అమ్మెందుకు సిద్ధమైందన్నారు.కార్పొరేట్ లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.అందుకే మార్చి28, 29 సమ్మె ద్వారా బీజేపీ ప్రభుత్వం దేశ విధ్వంసకర విధానాలు తిప్పికొట్టాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు.ఎన్నో త్యాగాలు రక్తతర్పణతో పోరాడి సాధించుకున్న చట్టాలు యజమానులకు అనుకూలంగా చేశారన్నారు.రైతు ఉద్యమ స్ఫూర్తితితో కార్మిక వ్యతిరెక కోడ్ లపై పొరాడాలన్నారు. రాష్ట్ర నాయకులు ఆశన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్,బాలాజీ,సంకె రవి, శ్రీను, భాగ్యరాజు, కుమారి, రాజలింగు,మధ్యాహ్నం భోజనం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, ఆశ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క,మెడికల్,మున్సిపాలిటీ,గ్రామపంచాయతీ,సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్,జిల్లా రజక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు ,ఆయా మండలల నుండి 400 మంది ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.