:
కట్టంగూర్ న్యూస్ :రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదగిరి.
దేశ సంపదను లూటీ చేస్తున్నా మోడీ విధానాలకు ప్రతిఘటనే దేశవ్యాప్త సమ్మె
కట్టంగూరు మండల కేంద్రం లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఏజెంట్ గా మారి కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రతిఘటన పోరాటమే ఈ దేశ వ్యాప్త సమ్మె అని *సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు * అన్నారు.
దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా కట్టంగూరు మండల కేంద్రంలో వివిధ రంగాల కార్మికులు నిరసన ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది* .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ పెట్టుబడిదారి లాభాలను మరింత పెంచుకోవడం కోసం రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు కావడంతో సమ్మె చేసే హక్కు యూనియన్ పెట్టుకునే హక్కు పని గంటలు కనీస వేతనాలపై తీవ్రమైన దాడి జరుగుతుందని వెంటనే నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ఎల్ఐసి,రైల్వే , బిఎస్ఎన్ఎల్ సహజ సంపద అయిన చమురు గనులు భూములను అంగట్లో బేరం పెట్టి స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టిందని విమర్శించారు. నిత్యం దేశభక్తి జపం చేసే బిజెపి రక్షణ రంగ సంస్థలు కూడ ప్రైవేట్ కరిచిందని అన్నారు.
కరోనా వచ్చి ప్రజల ఉపాధి పోయి ఆదాయాల పడిపోయి నక నక లాడుతుంటే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ధరలు పెంచుతుందని ఇవేన మోడీ తెస్తానన్న మంచి రోజులు అని ప్రశ్నించారు. ఇప్పటికీ గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగమే ప్రధాన ఉపాధి కేంద్రంగా ఉందని ప్రభుత్వం మాత్రం ఆ రంగంలో పనిచేస్తున్న రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులు ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడి ఆశ వివోఎలా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు
కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సమరశీల పోరాటాలు సిద్ధమవుతోందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో *చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంజి మురళి,నాయకులు తెలంగాణ మత్స్య శాఖ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురారి మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుడుగుంట్ల రామకృష్ణ,kvps మండల కమిటీ సభ్యులు దుప్పెల్లి నాగయ్య,dyfi కార్యదర్శి గోలి స్వామి, ఆశ మండల బాద్యులు వెంకటమ్మ, శ్రీదేవి, భవన నిర్మాణ కార్మికులు పాలడుగు యాదయ్య, ముత్తయ్య, ఎల్లయ్య,ప్రజా సంఘాల బాద్యులు తదితరులు పాల్గొన్నారు.