రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శనివారం అర్ధ రాత్రి నినాదం పాత్రికేయుడు బద్రి వెంకటేష్ యొక్క కారు, ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది.ఈ విషయం పై ఏబీజేఎఫ్ యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకత్వ సభ్యులు మంగళవారం జర్నలిస్ట్ బద్రి వెంకటేష్ ను కలిసి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని పరామర్శించారు.ఏబీజేఎఫ్ యూనియన్ జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం యూనియన్ రాష్ట్ర, జిల్లా సభ్యులు బెల్లంపల్లి పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎడ్ల.మహేష్ ను కలిసి ఆ సంఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని, మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఏబీజేఎఫ్ యూనియన్ తరుపున వినతి పత్రం అందజేశారు.జర్నలిస్టులు అంటే నిరుపేదలు, ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పోరాడే వారని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా భౌతిక దాడులు జరగడం చాలా దురదృష్టకరమని,రాష్టంలో జర్నలిస్టులపైన నిత్యం ఎక్కడో ఒక్కచోట దాడులు జరుగుతున్న సందర్భంగా రాబోయే రోజులల్లో దళితులను దూషిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ విధంగా పెడతారో అలాగే జర్నలిస్టులను దూషించిన, భౌతిక దాడులు ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టేలాగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చేలాగా విస్తృతంగా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి లక్ష్మణ చారి,బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రాంటెంకి,చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా రాజశేఖర్, ఉఫాద్యక్షుడు ఆత్రం మధుకర్, యూనియన్ సభ్యులు క్యాతమ్ సురేష్ కుమార్, సాలిగామ మల్లేశ్, ఎల్క తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.