ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షులు మనీ రామ్ సింగ్, రాజ్ కుమార్ పాండే లు పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగిందని, అనంతరం బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ధి కోసం పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం, సింగల్ విండో విధానం, మండల వ్యవస్థ పునరుద్ధరణ, వితంతు పెన్షన్, ఉచిత విద్యుత్తు, సింగరేణి కార్మికులకు సింగరేణిలో పరుగుపందెం ద్వారా 40 వేల మంది కార్మికులను భర్తీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఉన్న ఉద్యోగాలు పోగొట్టి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తెలంగాణలో ఓడించి మన సమస్యల పరిష్కారం కోసం మళ్లీ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దల నారాయణ, బొల్లం మల్లయ్య, గంగాధర్ గౌడ్, పోచన్న, యాదగిరి, రమేష్, ఎండి ఉస్మాన్, హసన్, రాజయ్యలు పాల్గొన్నారు.