రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పుదరి సమ్మయ్య తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ 2022 లో 45 సంవత్సరాల విభాగంలో పాల్గొని షార్ట్ పుట్ లో గోల్డ్ మెడల్ అలాగే డిస్కస్ త్రో లో సిల్వర్ మెడల్ సాధించాడు.పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్యను మంగళవారం బెల్లంపల్లి కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎడ్ల మహేష్, రూరల్ సీఐ కోట బాబురావు, టూ టౌన్ ఎస్సై జీవన్ శాలువాతో సత్కరించి అభినందించారు.