కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీఆర్ఎస్ నేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్. రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీఆర్ఎస్ నేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆటో కార్మికులతో ర్యాలీ
నిర్వహించారు. మోదీని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందన్నారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్ ల కిందికి మార్చి కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా
కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలపై టీడీఎల్, ఆర్డినెన్స్, విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ తదితర ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతుందన్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు పేరుతో
ప్రైవేట్ పరంచేసి మీటర్ల పేరుతో లూటీ చేసే కార్యక్రమానికి పూనుకుందున్నారు. పెట్రో ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై అధిక భారాలు మోపుతుందన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్కెవి మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంగాదేవి, స్వప్న జ్యోతి, కిష్టాపురం బాలమణి,యాదమ్మ, పద్మా, రాజమణి, సునీత, మమత, లావణ్య,అనిత, విజయలక్ష్మి, శోభారాణి మన్నెమ్మ ,డబిల్ పూర్ హేమలత ,అన్నపూర్ణ జయంతి,టిఆర్ఎస్కెవి మేడ్చల్ మండల అధ్యక్షుడు పరమేష్ ముదిరాజ్ మేడ్చల్ టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర విజయ, ఆటో స్టాండ్ అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్ కాలేజీ గౌడ్, ప్రభాకర్ గౌడ్, టిఆర్ఎస్కెవి రాణి ఇంజన్ వాల్స్ జనరల్ సెక్రటరీ చారి ,యాదగిరి ,గోపాల్.పాల్గోన్నారు.