దాచేపల్లిలో సిమెంట్‌ కర్మాగారం వద్ద కార్మికుల ఆందోళన_

కాంట్రాక్ట్‌ వేరే సంస్థకు ఇవ్వడంపై కార్మికులు అభ్యంతరం.

ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు డిమాండ్.

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబలికి.. ఎంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు. పురుగుమందుల డబ్బాలతో ఫ్యాక్టరీ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.కార్మికులతో పాటు ఆందోళనలో స్థానిక రైతులు కూడా పాల్గొన్నారు. ఫ్యాక్టరీకి పొలాలు ఇచ్చి పదేళ్లైనా… తమ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. యాజమాన్యం తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికులు పరిశ్రమ ఎదుట బైఠాయించారు.