రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని బుయ్యారం అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా స్థావరాలు నిర్వహిస్తున్నారు. అనేక స్థావరాలు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీంతో మండలంలోని అనేక మంది రైతులు, కూలీలు గుడుంబా బారినపడి అనారోగ్యాల పాలవుతున్నారని, ఇప్పటికైనా ఫారెస్ట్, ఎక్సైజ్ అధికారులు స్పందించి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.