*రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:రాష్ట్ర విద్యుత్ రెగ్యురేటరీ సంస్థ విద్యుత్ ఛార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసల పరిశ్రమలకు యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాన్ని వేసిందనే సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు.

సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక బస్టాండ్ దగ్గర దగ్ధం చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రావడంతో ప్రజలపై భారం పడుతుందన్నారు .ప్రతిపాదనలను ఉన్నదున్నట్టు రెగ్యురేటరీ కమిషన్ ప్రకటించడం అంటే ప్రతిపాదన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించలేదని *అర్థమవుతుందన్నారు. ప్రస్తుతం రూ 1.45 పైసలు కాగా ప్రస్తుతం యూనిట్‌కు 50 పైసల గురించి రూ1.95 పైసలు అనగా 34 శాతం పెంచారన్నారు.
*బహిరంగ మార్కెట్లో అతి తక్కువకు లభ్యంఅవుతున్న విద్యుత్‌ను కొనకుండా ఎక్కువ రేట్లకు వేలం లో పాడిన వారి దగ్గర కొనుగోలు చేస్తున్నారని* తెలిపారు.” ఆర్డర్ ఆఫ్ మెరిట్ డిస్పాచ్” ప్రకారం ఎసెండింగ్ విధానంతో విద్యుత్తు వినియోగించినట్లు నష్టాలు తగ్గుతాయని సూచించారు .కానీ ఎసేడింగ్ కు బదులు డిసెండింగ్ ఆర్డర్ విద్యుత్ శాఖ అమలు చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ విద్యుత్ జనరేషన్ కంపెనీల నుంచి కాకుండా అధిక ధరలకు ఆమె ప్రైవేటు జనరేషన్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడంతో వినియోగదారులపై అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ వృధా ఖర్చులు తగ్గించడం ద్వారా వారాలు పెంచకుండా సరఫరా చేయవచ్చని సిపిఎం గా సూచిస్తున్న మన్నారు గతంలో 2008 సంవత్సరం చంద్రబాబు టిడిపి ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేశామని ఆ పోరాటంలో పోరాటాల ఫలితంగా అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యుత్ చార్జీలు పెంచలేదని అన్నారు టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయింది భవిష్యత్తులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ ,మద్దేపురం రాజు, గడ్డం వెంకటేష్, సిపిఎం నాయకులు ఎదునూరి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్, వనం రాజు, బందెల ఎల్లయ్య, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డెబోయిన వెంకటేష్, ఒల్దాస్ అంజయ్య కొండ అశోక్ ,అబ్దుల్లాపురం వెంకటేష్, పగడాల శివ, బట్టుపల్లి నవీన్, నోముల శివ తదితరులు పాల్గొన్నారు.