• ఏసీబీ వలలో సూర్యపేట రూరల్ si లవకుమార్… రాయల్ పోస్ట్ ప్రతినిధి, సూర్యాపేట, మక్సుద్, సూర్యాపేట, 24/03/2022* ఫ్లాష్..ఫ్లాష్.... ఏసీబీ వలలో సూర్యపేట రూరల్ si లవకుమార్…
    రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుండి 1 లక్ష30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్న ఏసీబీ అధికారులు….
    బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న లవకుమార్ బుధవారం రాత్రి ఎస్పీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన శుక్రవారం అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండల పరిధిలోని రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వీఆర్‌కు వెళ్తూ కూడా ఎస్ఐ అవినీతికి పాల్పడటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.