సంగారెడ్డి: ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకోవాలి.. జిల్లా యస్.పి. రమణ కుమార్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున భర్తీచేయనున్న పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ. నియామకాల గురించి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులైన యువతి యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్.పి. ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందుకుగాను తేదీ: 22-03-2022 నుండి 27-03-2022 వరకు అర్హులైన యువతి యువకులు పూర్తి వివరాలను ఈ ఆన్లైన్ లింక్ లో https://www.jotform.com/build/220793184688469 పొందుపరచగలరు., ఆన్లైన్ లింక్ తేదీ: 27-03-2022 రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ అవసరాన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్ తమ,తమ సబ్-డివిజన్ 1. సంగారెడ్డి, 2. పటాన్ చెరు, 3. జహీరాబాద్ 4. నారాయణఖేడ్ లలో నిర్వహించడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన యువతీ యువకులకు ఉచిత పోలీస్ శిక్షణ అందించడం జరుగుతుంది. పురుషులు167.6 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉన్నవారు మాత్రామే అప్లై చేయాలి.
శిక్షణ తరగతులు (Indoor) ఎక్కడ ఎప్పుడు అన్న విషయాన్ని తరువాత పత్రిక ప్రకటనలో తెలియజేయడం జరుగుతుంది.