ఆలేరు గురుకుల బాలికల విద్యాలయం లో బాలికలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని కటినంగా శిక్షించాలి నల్గొండ కేంద్ర పట్టణం లో సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి నల్గొండ జిల్లా ఇంఛార్జ్ మరియు వినియోగదారుల చట్టం నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ నజీర్ గారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయంలో పని చేసే ఉద్యోగులు మైనార్టీ బాలికలను టార్గెట్ చేసుకొని వారి బాత్ రూముల దగ్గరకు వెళ్లి బాలికలను ఇష్టం వచ్చిన మాటలతో నాన ఇబ్బందులు పెడుతూ మీరు బయటి వ్యక్తుల తో వ్యభిచారం చేయాలి లేకపోతే చంపేస్తాం టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాం అని నాన విధాలుగా బాలికలను బెదిరిస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు. దేవాలయం లాంటి విద్యాలయం లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, యాదద్రి జిల్లా కలెక్టర్ ఒక మహిళ, ఆ నియోజిక వర్గానికి సంబందించిన ప్రజా ప్రతినిధి అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఒక మహిళ , ఇద్దరు మహిళలు పని చేస్తున్న జిల్లాలో ఇలాంటి సంఘటన జరగటం మహా దారుణం ప్రతి రోజూ రాష్ట్రం లో ఎదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు , హత్యలు దాడులు , మహిళల పై వేదింపులు జరుగుతున్న వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలేరు గురుకుల మైనార్టీ బాలికల విద్యాలయం లో బాలికలను వేదిస్తు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని కటినంగా శిక్షించాలి, గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ పై చర్య తీసుకొని వాళ్ల ను పర్యవేక్షంచాల్సిన అధికారుల ను సస్పెండ్ చేయాలి… సిబ్బంది నీ జైలు కు పంపాలి, మళ్ళీ ఎవరు ఇలాంటి వాటికి పాల్పడకుండా చేయకుండ చర్యలు ఉండాలి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జావిద్ , సలీం , ఆజాం , ఫహిం , జీషాన్ , గంజి వెంకన్న , సుధాకర్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు..