ఛత్తీస్‌గఢ్‌:- సుక్మాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై సోమవారం ఉదయం నక్సలైట్లు దాడి చేశారు. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. ఈ శిబిరాన్ని నెల రోజుల క్రితమే ప్రారంభించారు. ఈ ఘటన చింతగుఫా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం మిగిలిన సమాచారం అందాల్సి ఉంది