జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీర స్వామి గౌడ్
రాయల్ పోస్ట్ ప్రతినిధి,సూర్యాపేట, మార్చి 20

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీర స్వామి గౌడ్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమి, భుక్తి ,విముక్తి కోసం ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పేద ప్రజల విముక్తి కోసం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మల్లు స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. దొరల అహంకారానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసి ఎంతోమంది అట్టడుగు వర్గాల ప్రజలను ఉద్యమంలో మమేకం చేసిన విప్లవ కెరటం మల్లు స్వరాజ్యం అన్నారు. స్త్రీల హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యమకారిణి అని చెప్పారు. తుంగతుర్తి ప్రాంతానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది పేద ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పిన మహిళా ప్రజా ప్రతినిధిగా ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవత కిషన్ నాయక్, పట్టణ కార్యదర్శి జలగం సత్యం గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్, కోడి లింగయ్య, పట్టణ గౌరవ సలహాదారులు మాది రెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఏల్గురీ రమా కిరణ్ గౌడ్, పెగ్గేపురం నరసయ్య, ఉపాధ్యక్షులు బానోత్ జానీ నాయక్, పట్టెటి కిరణ్, సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య, ఆకుల మారయ్య, అయితగాని మల్లయ్య, రాపర్తి సురేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.