రాయల్ పోస్ట్ ప్రతినిధి:ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి.. మాజీ ఎంపిటిసిల పోరంమండల అధ్యక్షుడు మామిడాల అంజయ్య
మండలంలోని కొలనుపాకలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజం కావని మాజీ ఎంపీటీసీల పోరం మండలాధ్యక్షుడు మామిడాల అంజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొలనుపాక లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన వెంటనే పంపిణీ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్దికోసం చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి సారధ్యంలో విజయవంతంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జంగా పరుశరాములు. నాయకులు పి సంతోష్. బి సంపత్. పత్తి నరసింహులు. జంపయ్య తదితరులు ఉన్నారు

కొలనుపాక లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మామిడాల అంజయ్య