సంగారెడ్డి ప్రతినిధి రాయల్ పోస్ట్ న్యూస్….
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గడ్డపోతారం పారిశ్రామిక వాడలో శనివారం సాయంత్రం కురిసిన వర్షాలకు రసాయన పరిశ్రమలు తమకు అనుకూలంగా మలుచుకుని నాయి.వర్షపునీటిలో రసాయనిక వ్యర్థాలను వదలడంతో ఆ వ్యర్థాలు జిల్లెల సంపుటి ప్రవహించాయి రసాయన పరిశ్రమల తీరును గమనించిన గడ్డపోతారం ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పారిశ్రామికవాడలో పర్యటించి జిల్లెల వాగును పరిశీలించారు. రంగుమారిన వర్షం నీరు ప్రవహిస్తుండటంతో గమనించిన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ పారిశ్రామిక వాడల నుంచి జిల్లెల వాగులోకి ప్రవహిస్తున్న కలిసిన వర్షం నీటి వీడియో ని పిసిసి మెంబర్ సెక్రటరీ కలెక్టర్కు పంపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షం నీటిలో కలిపి వదలడం పారిశ్రామికవాడలో సాధారణంగా మారింది. దీని నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు..