కృత్రిమ కాలు ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు..
సంగారెడ్డి ప్రతినిధి రాయల్ పోస్ట్ న్యూస్..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామానికి చెందిన 38 సంవత్సరాల చాకలి రాజు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి పోవడంతో మంచానికి పరిమితం అయ్యాడు, గత కొంత కాలంగా విరిగిన కాలు తో నడవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక కార్యకర్త సత్యనారాయణ అనే స్వచ్ఛంద సంస్థ చిట్కుల్ సర్పంచ్ ముదిరాజులను ఆశ్రయించారు. బాధితుడికి ప్రేమ కాలు ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించి లక్ష రూపాయలను ఆదివారం ముదిరాజ్ సంఘం నాయకులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించి భరోసానిచ్చారు. కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులకు చాకలి రాజ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, గ్రామ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ చారి, నాయకులు నరసింహులు, శ్రీనివాస, వెంకటేష్, బాల్ రాజ్ కుమార్, మహేష్, తదితరులు పాల్గొన్నారు..