ఆలేరు మైనార్టీ పాఠశాలలో విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి

ఆడపిల్లల విషయంలో పూర్తి భద్రత కల్పిస్తాం… ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి
మార్చి 20 రాయల్ పోస్ట్ ప్రతినిధి దూడల అంబిక…
ఆలేరు పట్టణంలోని మైనార్టీ పాఠశాలలో విద్యార్థుల పై అసభ్యకరంగా వచ్చిన లేక పై ఆదివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి. సిఐ నవీన్ రెడ్డి. స్థానిక ఎస్సై ఇద్రిస్ ఆలీ విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ… మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని ఆమె భర్త వేధిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. భార్య భర్తల గొడవ ద్వారా గతంలో ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ రావడం జరిగిందన్నారు. అనుచిత వ్యాఖ్యలు రాసిన వారి వివరాలు తెలుసుకొని విచారణ చేపిస్తా మన్నారు. ఆడపిల్లల విషయంలో పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. మహిళా కానిస్టేబుల్ సివిల్ లో పాఠశాలకు వచ్చి తోటి విద్యార్థులను. సిబ్బందిని విచారణ చేశారన్నారు