గుమ్మడిదల ప్రతినిధి.రాయల్ పోస్ట్ న్యూస్.
చిన్నాపెద్ద కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఈ హోలీ పండుగ, హోలీ పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న గూడెం గ్రామం నందు యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి రంగులలో మునిగిపోయారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అయిన మమత వేణు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి ఉండడంవల్ల హోలీ పండుగను జరుపుకో లేమని,ఈసారి వీరభద్ర స్వామి కృపతో ఆయురారోగ్యాలతో ఉన్నామని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నామని వారు గ్రామ ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ కుమార్ వార్డు సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు.