గుండాల మార్చ్ 18(రాయల్ పోస్ట్ న్యూస్)గుండాల మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కదిరం గౌరయ్య గారు నిన్న అకస్మాత్తుగా హైదరాబాద్ లో మృతి చెందారు
వారి స్వగ్రామం బ్రహ్మణపల్లి గ్రామంలో అంతక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈరసరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయుడు అయిన సుద్దాల – బ్రహ్మణపల్లి పాఠశాలల్లో అనేక సంవత్సరాలు ఉద్యోగం చేశారు
బ్రహ్మణపల్లి గ్రామ కారోబర్ గా గ్రామానికి సేవలు అనేక సంవత్సరాలు అందించారు
వేలాదిమంది విద్యార్థులకు విద్యా నేర్పిన సరస్వతి పుత్రుడు అని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉట్ల భిక్షం రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెండెం సత్యనారాయణ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గూడ మధుసూదన్ గౌడ్ రాపోలు అశోక్ ఉట్ల రవి ముత్యం గోపాల్ శ్రీనివాస్ దంతూరి మల్లయ్య నాయిని కృష్ణారెడ్డి బడక వెంకన్న దంతూరి భాస్కర్ గౌడ్ న్యాలం మల్లేష్ గౌడ్ యాదగిరి నర్సింహ చారి సంజీవ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు