రాయల్ పోస్ట్ న్యూస్ జిల్లా ప్రతినిది:
సంగారెడ్డి జిల్లా:12
తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కానీ 8 ఏళ్ల తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే అన్నారు. తెలంగాణ వస్తే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వస్తాయి అనుకున్న, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఉన్న విలువ, తెలంగాణలో కరువైందనరు. తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన నేడు మరుగున పడే స్థితిలో ప్రభుత్వం తీసుకు వచ్చిందనాడు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఆంధ్ర యాజమాన్యం కే కేసీఆర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఎందుకు మనకున్న తెలంగాణ లోని వారికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రభుత్వంలో ప్రభుత్వం హెల్త్ కార్డ్ ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం పేరుకు మాత్రమే హెల్త్ కార్డ్ అని చెప్పిన ఎక్కడ పని చేయడం లేదని, ఆ సమయంలో వందల మంది జర్నలిస్టులు అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడి భోరున విలపిస్తున్నారు. ఇది కేసీఆర్ చేసిన పాపం కాదా అని అన్నారు. రాష్ట్రంలో రెండు యూనియన్లు ఉన్నా ఒకటి కేటీఆర్ దగ్గర చేతులు కట్టుకొని ఉంటే, మరొకరు హరీష్ రావు పేరు చెప్పి బతుకుతున్నారని, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా రేపు జర్నలిస్టులా సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టి జర్నలిస్టులు ఆదుకుంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే పోరాటం చేస్త మన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టు ఇచ్చిన ఇల్లు తప్ప ఎనిమిదేళ్ళ పాలనలో జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వని సీఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం లో కోట్లాడిన. రచన ల ద్వారా ఆంధ్ర పాలకులను చీల్చి చెండాడిన అల్లం నారాయణ నోరు ముత పడ్డాదని అన్నారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డి అశోక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా: కప్పరాప్రసాద రావు గారు TJU రాష్ట్ర అధ్యక్షులు, బింగి స్వామి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దాపురం నరసింహ గారు ifwj జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్, విశిష్ట అతిథులుగా ఢిల్లీ వసంత కుమార్ గారు సామాజిక ఉద్యమకారులు, రుద్రారం శంకర్ గారు జిల్లా అధ్యక్షులు తెలంగాణ వినియోగదారుల ఫోరం, జీవన్ రావ్ దేశ్ ముఖి గారు TJU కార్యవర్గ సభ్యులు, దేవులపల్లి ఎల్లయ్య గారు, జిల్లా అధ్యక్షులు సిద్దిపేట జిల్లా, మరియు జి దశరత్, ఎం.గిరి, మై పాల్ రెడ్డి , A. T. రాజరావు జిల్లా ఉప ఆద్యక్షులు, ఎం రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ,డి. మోహన్ దాస్, జి. మల్లేశం జిల్లా కార్యదర్శిలు, వీ.రమేష్, శివుడు, శిరీష, జావేద్ అలీ, యాదగిరి, శివకుమార్, రామ్ చందర్, నర్సింలు, రాజు, వీరేశం, లక్ష్మణ్, రాణ ప్రతాప్,చందు, శ్రీకాంత్ లు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.