సంగారెడ్డి జిల్లా:08
మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యునియన్ & అంబేద్కర్ యువ జన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీల అధ్యక్షులు డి అశోక్. దొబ్బల రవీందర్ ల ఆధ్వర్యంలో మనసిక రోగులైన మహిళలకు గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రవీందర్ మాట్లాడుతూ మహిళలకు స్వాతంత్రాన్ని ఇచ్చే విద్యాభ్యాసాన్ని బోధించిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ చైతన్యవంతులై సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీ.జర్జి అంబేద్కర్ సంఘం సంగారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు మరియు, మనోహర్, E.గోపాల్, మధు,జీ.నర్సిములు డి. అశోక్, రాములు పాల్గొన్నారు.