రాయల్ పోస్ట్ ప్రతినిధి/భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ పాఠశాలలోని మహిళలందరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నారు మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది రాయగిరి సహృదయ అనాధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రముఖ విద్యావేత్త అంజలి గుప్తా, డాక్టర్ జయశ్రీ ,భువనగిరి మండల విద్యాధికారి అండాలు, పాఠశాల చైర్ పర్సన్ మిస్సెస్ జయలక్ష్మి పాల్గొని వారు మాట్లాడుతూ ప్రముఖులందరూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కౌమార దశలోకి అడుగుపెడుతున్న యువతకు సరైన మార్గనిర్దేశనం చేయాల్సిన బాధ్యత గురువుల అందరిపైనా ఉందని ఒక సందేశాన్ని అందించారు . అలాగే పిల్లలకు కు నూతన పద్ధతులలో బోధన చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.