రాయల్ పోస్ట్ newsfఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షార్పు సంస్థ మరియు సఖి సిబ్బంది మహిళలకు సన్మానం..
రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణంలోని షార్ప్ సంస్థ మరియు సఖి సెంటర్ సిబ్బందికి పట్టణ దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. షార్ప్ సంస్థ మరియు సఖి సెంటర్ వారు మహిళలకు ప్రజలకు అందిస్తున్న సేవల గాను వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ బి ప్రమీల గారిని షాప్ సంస్థ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, కౌన్సిలర్ శోభ రెడ్డి, సిబ్బంది స్వరూప, సరిత, మరియు సఖి సెంటర్ కౌన్సిలర్లు శ్రీదేవి భార్గవి, సుమలత, లావణ్య దేవి, వరలక్ష్మి ,మంజుల, రమాదేవి భవాని గారు సన్మానించి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత నాయకులు బండారు రవి వర్ధన్, రమేష్ బాసర, మహేందర్ బండారు, జహంగీర్, నవీన్, ఏం నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.