మహిళా బంధు సంబరాలు

👉 కెసిఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన మహిళలు

హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

*సంగారెడ్డి జిల్లా *జిన్నారం మండలం నల్తూర్ గ్రామం కెసిఆర్ చిత్రపటానికిరాఖీ కట్టిన మహిళలు

జిన్నారం మండలం ప్రతినిధి (రాయల్ పోస్ట్ న్యూస్)

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మహిళా దినోత్సవ మూడు రోజులు వేడుకలలో భాగంగా ఈరోజు జిన్నారం మండలం నాల్తుర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాయికోటీ రాజేష్ గారి ఆధ్వర్యంలో మహిళలు ఘనంగా సంబురాలు నిర్వహించారు. కేసీఆర్ గారి చిత్రపటానికి చేసి రాఖీలు కట్టిన మహిళలు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయనిన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. స్వరాష్ట్రం సాధించిన నాటి నుండి ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా గౌరవ సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, తెలంగాణ ఆడపడుచులకు,అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల రూపకర్త మహిళబందు మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్,స్థానిక సర్పంచ్ జనార్దన్, మండల పార్టీ అధ్యక్షుడు నాయికోటి రాజేష్ మరియు నల్తూర్ గ్రామ ప్రజలు వార్డు సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు