మచ్చ లేని నాయకుడు శ్రీనివాస్ గౌడ్

ఘనంగా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసిన జై గౌడ ఉద్యమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతoగి వీరస్వామి గౌడ్
రాయల్ పోస్ట్ ప్రతినిధి సూర్యాపేట, మార్చి 6

తెలంగాణ మలి దశ ఉద్యమ నాయకులు,జిల్లా గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు,జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరిగాయి.రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అంతకు ముందు భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సూర్యాపేట జిల్లాలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మచ్చలేని నాయకుడుగా సూర్యాపేట జిల్లాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడం తో పాటు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా శ్రీనివాస్ గౌడ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం అసోసియేషన్ సంఘానికి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఆటో యూనియన్, ఎన్నో కార్మిక రంగాల సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అని కొనియాడారు. ఎంతో మంది యువకులను తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసిన శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి,జిల్లా గౌరవ అధ్యక్షులు దేవత కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలుగూరీ రమా కిరణ్, బిల్డర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జానయ్య, అమరవాది శ్రావణ్,నిమ్మల శ్రీకాంత్, ఎరుకల సైదులు,బోమ్మగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.