రాయల్ పోస్ట్ ప్రతినిధి మార్చి /యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేల్పుపల్లి,ఇబ్రహీంపూర్ గ్రామాల్లో తాటి, ఈత చెట్లను ధ్వంసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘము అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాదాద్రి భువనగిరి జిల్లా తో పాటు తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములు కొనుగోలు చేసుకుని వ్యాపారం చసుకోవడంలో తప్పులేదని కానీ అట్టి భూములలో ఉన్న గౌడ జాతీ జీవన ఆధారమైన తాటి,ఈత వనాలను పూర్తిగా ధ్వసం చేస్తు గౌడ కుటుంబాల పొట్ట కొట్టడ మేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు వెంటనే సంబంధిత ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బాద్యులైన రీయల్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో గౌడ కులస్థులతో కలిసి పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు