రాయల్ పోస్ట్ న్యూస్:గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెటులో అధిక నిధులు కేటాయించాలి -సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్
జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సిపిఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గుండాల గ్రంథాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరు అయిన గంధమల్ల రిజర్వాయర్ సకాలంలో పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు.
చట్టసభలకు ఎంపికైన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కావడం లేదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో జిల్లాకు కేటాయింపులు ఘనంగా చూపి సగానికంటే తక్కువ ఖర్చు చేశారని అన్నారు.ఉదాహరణకు 2014 -15 బడ్జెట్లో 1,02,172 కేటాయించి కేవలం 62,786 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడి అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు.దీనితో పాటు బస్వాపురం ప్రాజెక్టు,పునాదిగాని కాల్వ పూర్తిచేయాలని అన్నారు.