మహిళ బందు సంబరాలు

జిన్నారం మండలం ప్రతినిధి
(రాయల్ పోస్ట్ న్యూస్)

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాలను మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీలలో మహిళా బంధు కేసీఆర్ గారి పేరిట సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందులో భాగంగా నేడు 6వ తేదీన ఆశావర్కర్లు,ఎ.ఎన్.ఎంలకు సన్మాన కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిన్నారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్లు,ఎ.ఎన్. ఎంలు,సిబ్బందికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ గారు సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆశావర్కర్లు,ఎ.ఎన్.ఎంలను సన్మానించాడం జరిగిందని.మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళల భద్రత కోసం షీటీమ్‌లు,గర్భిణుల కోసం కేసీఆర్‌ కిట్స్‌, అమ్మఒడి లాంటి పథకాలు ప్రవేశపెట్టి, అండగా నిలుస్తున్నారని, అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో సైతం మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని, దేశంలోనే తొలిసారిగా 1,32,504 మంది ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసిఆర్ ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేవిధంగా ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని ఇవి నిలువెత్తు చైతన్యదీపికలుగా విరాజిల్లుతున్నాయన్నారు.నాడు తెలంగాణలో ఆడబిడ్డలు మంచినీటి కోసం దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని ఆ కష్టాలకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపారని ఆర్థికంగా, రాజకీయంగానే కాదు పారిశ్రామిక రంగంలోనూ మహిళలు సత్తా చాటాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని అందుకే రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళల కోసం 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారని,కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మేనమామగా మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేయూత ఇస్తున్నారని…ఇప్పటిదాకా 10 లక్షల మంది పైచిలుకు లబ్దిదారులకు మొత్తం రూ.9,022 కోట్ల ఆర్థిక సహాయం అందించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని గతంలో పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండా ఉండేది అని.కానీ 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని,ఆశావర్కర్లు కు జీతాలు పెంపు,బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు,మహిళలు సొంతంగా (START UP)లు మొదలు పెట్టడానికి అవసరపడే WE-HUB ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అని GHMC లో మహిళలకు 50 శాతం స్థానాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ స్త్రీనిధి రుణాలు,మార్కెట్ కమిటీలలో సైతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ గారు ఎనలేని కృషి చేస్తున్నారని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ,వార్డు సభ్యులు తోట సల్లమ్మ,కొరబోయిన మంజులయాదయ్య ,శ్రీనివాస్ యాదవ్,ఏర్పుల లింగం,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,నర్సింలు,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి నాయకులు బ్రహ్మేందర్ గౌడ్,మంద రమేష్,తోట నర్సింగ్ రావు,సొసైటీ డైరెక్టర్ నీలం మోహన్,వీరభద్రస్వామి ఆలయ డైరెక్టర్ గోపి గౌడ్,మున్ని నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.