హైదరబాద్: దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా దేశంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. దేశంలో ఇప్పటికంటే మరింత మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరముంది. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నాం. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుంది’’ అని కేసీఆర్‌ తెలిపారు.