‘మన ఊరు -మన బడికార్యక్రమం కోసం రూ.7,289 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం ధళిత బంధు, మన ఊరు మన బడి సంక్షేమ పథకాల పై మంత్రి సమీక్ష నిరహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకం అన్నారు. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రి కెసిఆర్ వనపర్తిలో 'మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు.
ఇక దళిత బందు కింద ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో 1156 మంది లబ్దిదారులకు 115 కోట్ల రూపాయిలు వినియోగించనున్నామని అన్నారు. దళితబంధు కార్యక్రమంలో ఎక్కవగా డెయిరీ యూనిట్లు ఏర్పాటుచేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.