దిల్లీ:-ఉక్రెయిన్‌లో రాజధాని కీవ్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ నడిబొడ్డులోని నివాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతోంది.

అయితే, ఖార్కివ్‌పై దాడుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఈ మేరకు విద్యార్థి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

చనిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే, భారతీయ పౌరులు తక్షణమే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను వీడాలని అక్కడి భారత రాయబార కార్యాలయం తాజాగా సూచనలు జారీ చేసింది.