28 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె….

  • ప్రజల్ని కాపాడాలి… దేశాన్ని రక్షించుకోవాలి…

సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబా…

రాయల్ పోస్ట్ న్యూస్:ఈ నెల 28 29 తేదీలలో 48 గంటల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబా తెలిపారు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు తో కలిసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, కేంద్ర బడ్జెట్ లో కార్మికులకు తీరని అన్యాయం చేశారని వాటికి నిరసనగా దేశవ్యాప్తంగా 48గంటల సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపిన ట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్ప చెపుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి కార్పొరేట్ శక్తులకు ఇచ్చే సబ్సిడీలను పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు వంట నూనెలు పప్పు దినుసులు ఇతర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆ భారం అంతా సామాన్య ప్రజలపై పడుతుందని వాపోయారు కరువు కాలంలో లాభాలు గడించిన కార్పొరేట్ శక్తులకు పన్నులు పెంచాల్సి ఉన్నప్పటికీ వాటిని పెంచకుండా వారికి మద్దతు ఇవ్వడం సరైంది కాదన్నారు.. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి భవిష్యత్తులో ఆ వ్యవస్థను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు జాతీయ ఆస్తుల నగదీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని విమర్శించారు జాతీయ ఆస్తులు అమ్మటం ప్రైవేటీకరణ చేయడం దేశానికి పెద్ద ప్రమాదం అని చెప్పారు వీటిని కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమం నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు కార్మికులు ఉద్యోగులు తమ విధులను నిర్వహించకుండా నిరసన తెలిపితే దేశవ్యాప్తంగా సేవలు స్తంభించి పోతయని అన్నారు హక్కులను సాధించుకునేందుకు భవిష్యత్లో బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు సమ్మె విజయవంతం చేసేందుకు గ్రామస్థాయిలో సమ్మె నినాదాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు రైతు ఉద్యమ స్ఫూర్తితో కార్మిక ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు కార్మికులను చైతన్యపరిచి అన్ని రంగాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు ఈ నెల 14 లోపు గ్రామపంచాయతీ లో ఆయా రంగాల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు జారీ చేయాలని సూచించారు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె విజయవంతం చేయాలని కోరారు సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డబ్బీకార్ మల్లేష్, జిల్లా నాయకులు సత్తయ్య ప్రమీల, సలీం, పరిపూర్ణ చారి, అవుతా సైదులు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు