ధరఖాస్తులు చేసుకోనుటకు తేది పొడగింపు

నిరుద్యోగులైన యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సులలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందుటకై
దరఖాస్తు చేసుకొనుటకు తేది:08-03-2022 వరకు పొడగించడమైనది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిచే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం యాదగిరిగుట్ట నందు నిరుద్యోగులైన యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల నందు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
కావునా నిరుద్యోగులైన ఆసక్తి గల యువతీ యువకులను కోరడం ఏమనగా ఈ క్రింద తెలియపరిచిన స్వయం ఉపాధి కోర్సుల నందు గతంలో తేది:25-02-2022 వరకు దరఖాస్తు చేసుకొమ్మని తెలియజేసిన విషయం విధితమే, చాలా మంది అభ్యర్థనల మేరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం పొడగించడమైనది. కావున శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, స్త్రీ శక్తి భవనం, MPDO ఆఫీస్ వెనుక, యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయములో తేది: 08-03-2022 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగును. అనంతరం తేది : 10-03-2022 నుండి 4 వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగును.
ఈ క్రింద తెలిపిన స్వయం ఉపాధి కోర్సులనందు 03 నెలలు శిక్షణ ఇవ్వబడును
(తేది:10-03-2022 నుండి శిక్షణ తరగతులు ప్రారంభించును)
క్రమ సంఖ్య శిక్షణాంశాలు కనీస విద్యార్హత శిక్షణ కాలం
1 బ్యూటీషియన్ (బ్యూటీ పార్లర్ ) 10 వ తరగతి పాస్ /ఫెయిల్ 3 నెలలు
2 కంప్యూటర్స్ (యం.యస్.ఆఫీస్ కోర్సు) 10 వ తరగతి పాస్ /ఫెయిల్ 3 నెలలు
3 గార్మెంట్ తయారీ ( బేసిక్ టైలరింగ్ ) 10 వ తరగతి పాస్ /ఫెయిల్ 3 నెలలు
4 మొబైలు సర్వీసింగ్ మరియు రిపైర్ 10 వ తరగతి పాస్ /ఫెయిల్ 3 నెలలు
5 ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ (Electrical House Wiring) 7వ తరగతి పాస్ 3 నెలలు
గమనిక : 4వ బ్యాచ్ ప్రారంభం అనంతరం, తదుపరి బ్యాచ్ ల కొరకు దరఖాస్తుల స్వీకరణ నిరంతరముగా జరిగే ప్రక్రియ.
ఇట్టి దరఖాస్తుతో పాటు జత చేయవలసినవి: 1). విద్యార్హతల పత్రములు, 2). కుల ధృవీకరణ పత్రం, 3). ఆధార్ కార్డు జిరాక్స్, 4) పాస్ పొటోలు (08). రెండు జతల జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను సమర్పించవలసినదిగా కోరడమైనది.
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు : వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం , స్త్రీ శక్తి భవనం, MPDO ఆఫీస్ వెనుక, యాదగిరిగుట్ట,
ఫోన్ : 08685 299977, 8309925693, 8639575616, 9885627936, 9948902182.
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయము – S-4, 2వ అంతస్థు నూతన కలెక్టరేట్ భవనం, యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయములలో సంప్రదించవచ్చును. కె.ధనుంజనేయులు