ప్ర‌క‌ట‌న చేసిన భార‌త దౌత్య కార్యాల‌యం
భార‌తీయ విద్యార్థులు ప‌శ్చిమ ప్రాంతాల‌ వైపు వెళ్లాలి
అందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్నామన్న ఎంబసీ

కీవ్ న‌గరాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ర‌ష్యా దాడులు చేస్తోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ వీకెండ్ క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, భార‌త విద్యార్థుల‌ను ఉక్రెయిన్ నుంచి త‌ర‌లించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. కర్ఫ్యూ ఎత్తివేసిన‌ట్లు భార‌త దౌత్య కార్యాల‌యం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

అలాగే, భార‌తీయ విద్యార్థులు ప‌శ్చిమ ప్రాంతాల‌ వైపు వెళ్లేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు తెలిపింది. భార‌తీయ విద్యార్థులు ఈ ప్ర‌త్యేక రైళ్లలో ప‌శ్చిమ ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని భార‌త దౌత్య కార్యాల‌యం తెలిపింది. అక్క‌డి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్, రోమానియా దేశాలకు చేరుకోవ‌చ్చు. అక్క‌డి నుంచి భార‌తీయ విద్యార్థుల‌ను ప్ర‌త్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.