రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రాష్ట్ర vra ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా.లింగరాజు గారి ఆధ్వర్యంలో, యాదగిరి గుట్ట లోతెలంగాణ రాష్ట్ర vra ల అందరి తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారు బాగుండాలని,రాష్ట్రం లో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,అలాగే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించాలని,దేశం లొనే మొదటి స్థానం లో ఉండాలని,అలాగే vra లకు పే స్కేల్ G. O. వచ్చి అమలు కావాలని ఈ రోజు స్వామి వారికి అభిషేకం చేయించడం జరిగింది.అలాగే తెలంగాణ రాష్ట్రం లో ఉన్న vra లు అందరూ కలిసి కేసీఆర్ గారు,రాష్ట్ర ప్రజలు బాగుండాలి మరియు vra లకు పే స్కేల్ G. O అమలు కావాలి అనే నినాదం తో యాగం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగరాజు గారు,రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బాలమని గారు,యద్రాద్రి భువనగిరి జిల్లా సలహా దారు, అధ్యక్షులు గిరి గారు,కిషన్ గారు,నవీన్ గారు,స్వామి గారు,లక్ష్మీ గారు,వెంకటేష్ గారు పాల్గొన్నారు.
*VRA లకు పే-స్కెల్, PRC జిఓ లను విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని,55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని , తెలంగాణా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల(VRA) ఐక్య కార్యాచరణ రాష్ట్ర నాయకులు ,vra లు అందరూ కలిసి స్వామి వారికి అభిషేకం చేయించడం జరిగింది.