జిన్నారం మండలం ప్రతినిధి (రాయల్ పోస్ట్ న్యూస్)
పోలియో ఆదివారం ఫిబ్రవరి 27/2022 రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి & టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్రంలో పోలియో మహమ్మారిని తరిమికొడదాం అని చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏర్పుల లింగం,నాయకులు మంద రమేష్,బ్రహ్మేందర్ గౌడ్,నీలం మోహన్,రాఘవేందర్ రెడ్డి,నిఖిల్ గౌడ్,ప్రేమ్,బలరాం తదితరులు పాల్గొన్నారు.