రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రతి సమస్యకు సెల్ టవర్ ఎక్కడం పరిపాటిగా మారిపోయింది.హోటల్ లో పనిచేసే ఓదేలు అనే వ్యక్తి తన అవసర నిమిత్తం 50 వేల రూపాయల అప్పు చేసాడు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పనిలేక పోవడం వల్ల బాకీ చెల్లించలేక పోయాడు.ఇదే అదునుగా భావించిన అప్పు ఇచ్చిన వ్యక్తి ఏకంగా 4.50 లక్షల బాకీ ఉన్నట్లు కోర్ట్ ద్వారా నోటీసులు పంపడంతో కంగుతిన్న ఓదేలు ఎం చేయాలో తెలియక ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ టవర్ ఎక్కడం జరిగింది.ఈ విషయం అటుగా వెళ్తున్న ఎం.ఎల్.ఏ దుర్గం చిన్నయ్య కంట పడడంతో ఆగి టవర్ పైన ఉన్న ఓదేలుకు కాల్ చేసి నీ సమస్య ఏంటని ఎందుకు ఎక్కావని అడగడం జరిగింది.ముందు కిందకి దిగి వస్తే నీ సమస్య పరిష్కారం చేసినాకనే నేను ఇక్కడి నుండి వెళ్తాన గుని చెప్పడంతో ఓదేలు కిందకి దిగిరావడంతో కథ సుఖంతమైనది.