రాయల్ పోస్ట్ న్యూస్ దుబాయ్: ఈ‌ రోజు భుక్య నుసిలాల్
చింతకుంట గ్రామం, కథలాపూర్
మండలం , జగిత్యాల జిల్లా
అనే వ్యక్తి అనేక కష్టాలను అనుభవించి ఊరిలో ఉపాధి కరవు కావడంతో ‌దుబాయి
వెళ్లాడు. ఎడారి పంచన చేరి విధి వెక్కిరించడంతో ఉపాధి వేటలో కొన్నాళ్లు అక్కడ కష్టాలు పడినా 2020 తొలి నుంచీ కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. అనారోగ్య సమస్యలతో ఉపాధి దిక్కులేని వాడయ్యాడనీ తెలంగాణ కంపెని యజమని జైత నారాయణ గారు వెంటనే స్పందించి కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖతో పాటు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. దుబాయిలోని సామాజిక సేవకుడు జైత నారాయణ గారు మరియు DUBAI BSP TEAM గారి సహకారం తోచొరవ తీసుకుని భారత రాయబార కార్యాలయం (Consulate general of India)నుంచి పాస్‌పోర్టు దుబాయి ఇమిగ్రేషన్‌ శాఖ నుంచి అనుమతి పత్రాలు రప్పించారు.దీంతో INDIGO విమానం(22/02/2022) దుబాయి నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు.