రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మరియు దేవాపూర్ ఫ్యాక్టరీ ముందు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో న్యాకొ సహకారంతో జన జాగృతి కళాజాత నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాకారులు హెచ్ఐవి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు రక్తదానం తల్లి నుండి బిడ్డకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్ఐవి సోకిన వ్యక్తికి మందులు వాడటం యువత చెడు దారిలో పోకూడదని పెడదారిన పట్టకూడదని ఆట,పాట ద్వారా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమం ఈనెల 19న జన్నారం మండలంలో ప్రారంభించి రెబ్బనపల్లి, లక్షింపేట,ముల్కల,ఇందారం,భీమారం, బీజోన్, దేవాపూర్, బెల్లంపల్లి, ఐబీ చౌరస్తా,తిర్యాని,గోలేటి,రెబ్బన,కాగజ్నగర్,చింతగూడా,ఈజ్ గమ,సిర్పూర్ టి,కౌటాల, ఆసిఫాబాద్ లో 28వ తేదిన ముగింపు అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాజాత బృందం టీం లీడర్ గణేష్, నరేష్, దీపక్,ఆదిత్య,హరిప్రియ పాల్గొన్నారు.