గుండాల ఫిబ్రవరి 23(రాయల్ పోస్ట్ న్యూస్) గుండాల మండలం తురకల షాపురం గ్రామ శివారులో ఇటుక బట్టీల వద్ద వలస వచ్చిన ఇద్దరు బడి బయట పిల్లలను గుర్తించడం జరిగింది ,వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం అన్నారం గ్రామం నుంచి వలస వచ్చారని తెలిపారు ,సి. అర్.పి దేవనబోయినలింగయ్య మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు బడిలో ఉండాలి కానీ పనిలో కాదని తెలిపారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు పట్ల కౌన్సిలింగ్ ఇచ్చి వీరిని సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద పడిశాలపాఠశాల లో తమ్మిశెట్టి ప్రవీణ్ s/ రాము ఏడవ తరగతి, తమ్మిశెట్టి మేఘన ఆరో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించడం జరిగిందన్నారు ,పిల్లలు పాఠశాలకు వెళ్లే విధంగా ఇటుక బట్టీల యజమాని రవాణా ఖర్చు భరించాలని తెలిపారు