సూర్యాపేట: సూర్యాపేట రాపర్తి వంశస్తుల ఆధ్వర్యంలో మార్చి 5 6 తేదీల్లో జరిగే వన మైసమ్మ అమ్మవారి పండుగ కు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ని రాపర్తి వంశస్థులు ఆహ్వానించారు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయం లో రాపర్తి వంశస్తుల ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా రాపర్తి వంశస్థులు మంత్రి తో మాట్లాడుతూ మార్చి 5వ తారీఖు సాయంత్రం స్థానిక పి ఎస్ ఆర్ సెంటర్ లోని కళ్ళు గీత పారిశ్రామిక సహకార సంఘం కార్యాలయం నుండి అమ్మవారి గంప తో ర్యాలీ బయలుదేరుతుందని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తాను తప్పక వస్తానని హామీ ఇచ్చారు ఒకే వంశానికి చెందిన 150 కుటుంబాలు కలిసికట్టుగా అమ్మ వారి పండుగ ను జరుపుకోవడం అభినందనీయమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతల పండగలకు ప్రజలు పెద్దపీట వేస్తారని నేటికి సాంప్రదాయాన్ని కోల్పోకుండా ఈ తరం వారు కూడా అమ్మవార్ల పండగను జరుపుకోవడం శుభసూచకమని అన్నారు ఈ కార్యక్రమంలో 28 వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్(R S) రాపర్తి వంశస్తుల సమన్వయకర్త రాపర్తి కేశవ్ గౌడ్ రాపర్తి సత్తయ్య రాపర్తి రవి రాపర్తి రమేష్ రాపర్తి సైదులు రాపర్తి జానయ్య రాపర్తి సత్యనారాయణ రాపర్తి దుర్గయ్య రాపర్తి యాదగిరి రాపర్తి చంద్రశేఖర్ రాపర్తి రమేష్ రాపర్తి అజయ్ తదితరులు పాల్గొన్నారు