రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ అగర్వాల్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రం లో కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రి అధిక మొత్తం వసూలు చేయడం వంటి పలు సమస్యలు భక్తుల ఫిర్యాదు మేరకు ఈ ఓ గీత రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.యాదాద్రి పుణ్యక్షేత్రం లో స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లే వస్తువులు కొబ్బరికాయలు పూలు, ఇతర పూజా సామాగ్రి వస్తువులు అన్నీ కూడా టెండర్లలో తీసుకున్న వ్యాపారస్తులు టెండర్లలో కోట్ చేసిన ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా విక్రయిస్తున్నారు ఉదాహరణకు 20 రూపాయలు అమ్మవలసిన కొబ్బరికాయను 50 నుండి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు దీనివలన వినియోగదారులు 30 రూపాయల నుండి 70 రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుంది ఇలాగే ఇతర పూజా సామాగ్రి అధిక ధరలకు విక్రయిస్తున్నారు వస్తువులు అధిక ధరకు విక్రయించడం ద్వారా వందల్లో వేలల్లో భక్తులు నష్టపోతున్నారు కాబట్టి ఇష్టానుసారంగా ధరను నిర్ణయించి అమ్ముతున్న వ్యాపారస్తుల పై చర్యలు తీసుకుని వినియోగదారునికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ వినియోగదారుల హక్కుల సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు నగేష్ కుమార్ ఈవో గీత రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ జనరల్ సెక్రెటరీ రామగిరి హరిబాబు, వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, సికింద్రాబాద్ కాంసెన్సీ ప్రెసిడెంట్ రమేష్, మరియు యాదాద్రి భువనగిరి జిల్లా సభ్యులు ఎర్రోళ్ల బాబు, ఎరుకల వెంకటేష్ గౌడ్, సిద్ది రాజు, రంగా ప్రశాంత్, ఆడెపు శ్రీకాంత్, సిద్ధిరాములు ,మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగిం