తెలంగాణ తాత్కాలిక డీజీపీగా అంజనీ కుమార్ వ్యవహరించనున్నారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్లోకి వెళ్తున్నారు. ఆయన ఎడమ భుజానికి స్వల్ప గాయం కావడంతో మార్చి 4 వరకు ఆయన అందుబాటులో ఉండరు.

దీంతో ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను హైదరాబాద్ పూర్వ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆయన ఇటీవలే ఏసీబీ డీజీగా నియమితులయ్యారు. ఇక హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ బాస్ మెడికల్ లీవ్లోకి వెళ్లడంతో మొత్తంగా 15 రోజుల పాటు అంజనీ కుమార్ డీజీపీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.