విద్యుత్ మోటార్ల బిగింపుతో రైతులకు తీవ్ర అన్యాయం

నల్ల చట్టాల మాదిరిగానే మరో రైతు ఉద్యమం తప్పదు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్

రాయల్ పోస్ట్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ సంస్కరణలతో రైతులకు మరో తీవ్ర అన్యాయం జరుగనున్నదని తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్యుత్ సంస్కరణలు రద్దు చేసుకోవాలని రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో రైతాంగం మరో తీవ్ర సంక్షోభం ఎదుర్కోక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల లో భాగంగా రైతులు మోటార్లకు మీటర్లు బిగించుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతులు తీవ్ర నష్టపోతారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం వల్ల కొంత ఊరట లభించిందని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు నిర్ణయాల వలన రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతారు అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలపై రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన చరిత్ర భారతదేశ రైతాంగానిదే నని తెలిపారు.ఐనా కేంద్రప్రభుత్వం లో మార్పు రాలేదని మళ్ళీ విద్యుత్తు సంస్కరణల పేరుతో మరో మోసానికి తెగబడుతుందని తెలిపారు. రైతులకు నష్టం కలిగే విద్యుత్ సంస్కరణలు వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి,మండవ వెంకటేశ్వర్లు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మురగుండ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.