ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివి

ఆరోగ్య తెలంగాణ నిర్మాణం లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం.

ఆశ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందుచేత.

రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

రాయల్ పోస్ట్ న్యూస్: కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‍గా పనిచేసిన ఆశా వర్కర్‌ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఆశా కార్యకర్తలు జీతం కోసం గత ప్రభుత్వ పాలనలో అనేక కష్టాలు పడ్డారని సీఎం కేసీఆర్ మాత్రం ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని జీతాలను రూ.9750కి పెంచారన్నారు.
ఆదివారం సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్‌ల మంత్రి ప్రారంభించి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపరుచడానికి ఆశా వర్కర్‌లకు స్మార్ట్ ఫోన్‌లను ఇవ్వడం అనేది వైద్య రంగం లో మంచి పరిణామం అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లో 330 మంది కి మంత్రి స్మార్ట్ ఫోన్ లు అందించగా, జిల్లా వ్యాప్తంగా 1070,
రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది దేశంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నని అన్నారు.
గత పాలకులు ఆశా సేవలను గుర్తించక పోవడం వలన ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సేవలను గుర్తించి తెలంగాణలో రూ.9,750 వేతనం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని మంత్రి వారి సేవలను కొనియాడారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం ద్వారా మరోసారి తన మాటలను రుజువు చేశారన్నారు.
ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడకూడా ఆశలకు వేతనాలు 3 నుండి 4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, తెలంగాణ లో రాష్టాన్ని వైద్య రంగం లో ప్రపంచంలో నే నంబర్ వన్ స స్థానంలో నిలబెట్టేందుకు అందరం కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ dr. కొటా చలం, వైద్య అధికారి సుదర్శన్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మా ది బిక్షం, సూర్యాపేట జడ్పిటిసి జీడీ బిక్షం, వాంకుడోతు వెంకన్న,వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు..