రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందినగౌతూరి మల్లయ్యకు గ్రామ సమీపంలో రెండు ఎకరాల పొలం ఉంది. వరినాట్లకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో పొలంకు నీళ్లు పట్టాడు. బుధవారం రాత్రి మోటర్ను ఆఫ్ చేసేందుకు పొలానికి వెళ్లాడు. గ్రామానికి చెందిన వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన వేటగాళ్లు మృతదేహాన్ని రాత్రికి రాత్తే ఘటన స్థలం నుంచి వేరే చోటికి మార్చారు. పొలం వద్దకు వెళ్లి తండ్రి ఉదయం వరకు రాకపోవడంతో ఆచూకి కోసం రెండు రోజులుగా కుమారులు సందీప్, బాపురావులు వెతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మృతదేహం లభ్యమైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన వ్యక్తులే గౌతూరి మల్లయ్య మృతదేహాన్ని ట్రాన్స్ఫార్మర్ వద్ద పడేశారని , విద్యుత్ తీగలు తొలగించి జాగ్రత్త పడ్డారని భార్య కమల నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై గోపతి నరేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.