రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్ గ్రామానికి చెందిన భీమయ్యకి 60,000 రూపాయలు, బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ కి చెందిన షేక్ సర్వర్ పాషా కి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమని, అనారోగ్యంతో ఉండి మెరుగైన చికిత్స కొరకు కార్పొరేట్ వైద్యం ఉండడానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,తదితరులు పాల్గొన్నారు.