గుండాల, ఫిబ్రవరి 18 (రాయల్ పోస్ట్ న్యూస్)
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్లలో 2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు గాను శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం గుండాల మండల స్థాయి 4 వ, 5 వ తరగతి బాల బాలికలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాలలో ఎంపికకు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పిఈటిలు సుద్దాల అమరేందర్, తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ గుండాల శాఖ పి మహేష్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం గుండాల బ్రాంచ్ కే శ్రీలత సిఆర్పి డి లింగయ్య, ఉపాధ్యాయులు సుధాకర్, వెంకటేశ్వర్లు, రవి, మహేష్, దశరథ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.