రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: సేవాలాల్ సేవలను గుర్తించి ,జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి….. బట్టు రామచంద్రయ్య. గిరిజనుల, ఆదివాసీల హక్కుల కొరకు నిరంతరం కృషి చేసిన సద్గురు
సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని దళిత ఐక్య వేధిక జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా లో సంత్ సేవాలాల్ జయంతి (283వ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లడారు. సంత్ సేవాలాల్ గిరిజనుల,ఆదివాసీల అభివృద్ధి కోసం, వారి హక్కుల కోసం జీవితాంతం కృషి చేసాడని ఆయన అన్నారు. సంత్ సేవాలాల్ చిత్ర పటాన్ని ప్రతి గిరిజనుని ఇంట్లో ఉండాలని కోరారు. లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు,జిల్లా ఇంచార్జి భానోతు రాజేష నాయక్, భానోతు భాస్కర్ నాయక్,
లు మాట్లడుతూ గిరిజనుల జనాభా ప్రకారం 12 శాతం రిజర్వేషన్ లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ జయంతి కార్యక్రమం లో ప్రజా సం
ఘాల నాయకులు కొడారి వెంకటేష్, మహ్మద్ సలావుద్ధీన్,, బర్రె రమేష్, బండారు శివ శంకర్, నాయిని పూర్ణ చందర్, ఉపేందర్, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భానోతు వెంకట నర్సింగ్ నాయక్, నర్సింగ్ నాయక్, సురేందర్ నాయక్, మహేష్ నాయక్, కమల్ నాయక్, వెంకటేష్ నాయక్, కుశంగుల రాజు,తుమ్మేటి పాండు,సాల్వేరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.